
పార్టీ బలోపేతమే లక్ష్యం
సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
వేడుకకు వేళాయె..
తుర్కయంజాల్: పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఏఐసీసీ పరిశీలకుడు, తిరునల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రూస్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తుర్కయంజాల్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆయన సమక్షంలోనే ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆదిబట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మర్రి నిరంజన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
అభిప్రాయాలు అందించిన నేతలు
ఆమనగల్లు: డీసీసీ అధ్యక్ష ఎంపికపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆదివారం కాంగ్రెస్ కమిటీ బాధ్యుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. ఏఐసీసీ పరిశీలకుడు, తిరునల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రూస్‌కు ఆమనగల్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టు కిషన్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల అధ్యక్షుడు జగన్, కడ్తాల్ అధ్యక్షుడు బిచ్చానాయక్, ఆమనగల్లు మున్సిపల్ అధ్యక్షుడు వస్పుల మాణయ్య తమ అభిప్రాయాలు అందించారు. ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సైతం రాబర్ట్ బ్రూస్‌ను కలిసారు.
అయిల పేరు సూచించిన నాయకులు
డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్ పేరును సూచించారు. నియోజక వర్గ పరిధిలో అయిల శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు డీసీసీ ఉపాధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి అంజయ్య, అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, గిరిజన సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్‌లు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ బాలాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాలులో ఏఐసీసీ పరిశీలకుడు రాబర్ట్ బ్రూస్ దరఖాస్తు చేసుకున్న ఐదుగురు నాయకులతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు.
టోల్‌ప్లాజా వద్ద పండుగ రద్దీ
షాద్‌నగర్: దీపావళి పండుగ సందర్భంగా చాలామంది సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్–బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ప్రయాణికుల సంఖ్య పెరిగింది. షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ శివారులో ఉన్న జడ్చర్ల ఎక్స్‌ప్రెక్స్ వే టోల్‌ప్లాజా వాహనాలతో రద్దీగా మారింది. ఇబ్బంది కలగకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు.
చేవెళ్ల: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం పథసంచలన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వయం సేవకులు చేవెళ్లలోని రచ్చబండ నుంచి పురవీధుల మీదుగా కేవీఆర్ గ్రౌండ్ వరకు కవాతు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన వక్త డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గ్రామగ్రామాన స్వయం సేవక్ సంఘ్‌ను విస్తారించాలని, దేశాభివృద్ధే లక్ష్యంగా పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఆర్‌ఎస్‌ఎస్ చేవెళ్ల సంఘ్ చాలక్ బిల్లపాటి కృష్ణారెడ్డి, మైపాల్‌రెడ్డి, మల్లేశ్, కె.వెంకట్‌రెడ్డి, సురేందర్, సాయిరాం, బీజీపీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, డాక్టర్ వైభవ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, పాండురంగారెడ్డి, ప్రవీణ్, శర్వలింగం, ఆంజనేయులుగౌడ్, కృష్ణారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
శంకర్‌పల్లి పట్టణంలో..
శంకర్‌పల్లి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం శంకర్‌పల్లి పట్టణంలో పథ సంచలన్ నిర్వహించారు. కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. పట్టణంలోని డీఎంఎర్ గార్డెన్స్ నుంచి ప్రారంభమై పురవీధుల మీదుగా తిరిగి గార్డెన్స్‌కి చేరుకుంది.
వెలుగు దివ్వెల వేడుక దీపావళిని సోమవారం ఘనంగా జరుపుకొనేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. పండుగ నేపథ్యంలో ఆదివారం మార్కెట్లలో సందడి కనిపించింది. పూలు, ప్రమిదలు, దొంతులు, గుమ్మడికాయలు, బాణసంచా విక్రయాలు జోరుగా సాగాయి.
ఏఐసీసీ పరిశీలకుడు రాబర్ట్ బ్రూస్

పార్టీ బలోపేతమే లక్ష్యం

పార్టీ బలోపేతమే లక్ష్యం

పార్టీ బలోపేతమే లక్ష్యం

పార్టీ బలోపేతమే లక్ష్యం

పార్టీ బలోపేతమే లక్ష్యం

పార్టీ బలోపేతమే లక్ష్యం