పండగ వేళ.. పారా హుషార్‌ | - | Sakshi
Sakshi News home page

పండగ వేళ.. పారా హుషార్‌

Oct 20 2025 9:28 AM | Updated on Oct 20 2025 9:28 AM

పండగ

పండగ వేళ.. పారా హుషార్‌

చెడుపై విజయానికి గుర్తుగా జరుపుకొనే సంబురం దీపావళి. ఈ సందర్భంగా బాణసంచాలు కాలుస్తూ కేరింతలు కొడతాం. అయితే ఈ ఆనందోత్సాహాల వేళ.. దివ్వెల పండుగ కారాదు జీవితాల్లో చీకటిమయం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టపాసులు వెలిగించే విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

షాద్‌నగర్‌: జీవితాల్లో వెలుగులు నింపాల్సిన దీపా వళి పర్వదినాన.. ఏటా చాలా చోట్ల, చాలా మంది టపాసులు కాలుస్తూ గాయాల పాలవుతున్నారు. ముఖ్యంగా కంటికి. పలువురు చూపును కోల్పోయి జీవితాల్లో చీకట్లను నింపుకొంటున్నారు. ఇలాంటి బాధితులు ఏటేటా పెరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.

నిర్లక్ష్యం తగదు

కంటిలో ముందు గుండు పడగానే చల్లటి నీటితో కడగాలి. దీని వలన రసాయనాల ప్రభావం తగ్గుతుంది. కంటిని చేతితో రుద్దితే.. గాయం మరింత పెరుగుతుంది. కొందరు ఇంట్లోనే ఐ డ్రాప్స్‌ వేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. రసాయనాల చర్య జరిగి, ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. పొగ వలన కూడా కళ్లు ఎర్రబారుతాయి. నీరు కారుతుంది. దురద పెడుతుంది. ఏం కాదని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలి.

కాంటాక్టు లెన్స్‌ వద్దు

టపాసులు కాల్చే ముందు విధిగా కళ్లద్దాలు ధరించాలి. వీటి వలన కంటికి 99 శాతం రక్షణ లభిస్తుంది. ● టపాసులు చేతితో వెలిగించేటప్పుడు కంటికి దగ్గరగా పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి దూరంగా పెట్టి వెలిగించాలి. ● టపాసులు వెలిగించిన చేతులతో కంటిని రద్దుకోకూడదు. ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలి. వారిని కనిపెడుతూ ఉండాలి. ● కాంటాక్టు లెన్స్‌ పెట్టుకొని పటాకులు కాలుస్తుంటారు. అది ప్రమాదకరం. వేడికి అవి నల్ల గుడ్డుకు అతుక్కుపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటిని తీసేయడమే ఉత్తమం. ● కొన్ని సార్లు చిచ్చు బుడ్డి, భూచక్రం వంటివి అకస్మాత్తుగా పేలి కంటికి, శరీర భాగాలకు తీవ్రగాయాలవుతుంటాయి. ● రాకెట్‌ వంటివి నేరుగా మీదికి వచ్చే అవకాశం లేకపోలేదు.

గడ్డివాములు, వాహనాలకు దూరంగా

గ్రామాల్లో టపాసులు పేల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. పేలిన టపాసులు గడ్డివాముల పై పడి, అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. వాటికి దూరంగా పటాసులు కాల్చాలి. ● కార్లు, ద్విచక్రవాహనాలకు దూరం కాల్చాలి. లేదంటే పెట్రోలు, డీజిల్‌కు ట్యాంకుల పై నిప్పు రవ్వలు పడే ప్రమాదం ఉంది. ● విధిగా షూ, చెప్పులు ధరించాలి. ముఖానికి మాస్కు పెట్టుకోవాలి. ● టపాసులను ఇంటికి దూరంగా కాల్చాలి, ధ్వని అధికంగా వచ్చే టపాసులను కాల్చకపోవడం ఎంతో మేలు. ● ప్రమాదం జరిగే వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలి. లేదంటే 108 సిబ్బందికి సమాచారం అందించాలి.

దీపావళి కారాదు.. జీవితాల్లో అంధకారం

బాణసంచా కాల్చేటప్పుడుగాయాలయ్యే ఆస్కారం

జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

కాళ్లకు షూ.. కంటికి అద్దాలు

బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్య లు వస్తాయి. టపాసులు పేల్చేటప్పుడు చెప్పులు, షూ విధిగా ధరించాలి. కంటికి అద్దాలు పెట్టుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. చిన్నారులపై దృష్టి సారించాలి.

– డాక్టర్‌ విష్ణువర్ధన్‌, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, షాద్‌నగర్‌

పండగ వేళ.. పారా హుషార్‌ 1
1/1

పండగ వేళ.. పారా హుషార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement