
విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి
చేవెళ్ల: వాహనంలో కొత్తిమీర లోడ్ చేసి, కవర్ కప్పుతుండగా.. పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బస్తేపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా పులుసు మామిడి గ్రామానికి చెందిన మహమ్మద్ జహంగీర్(26), చేవెళ్లలో బోలెరో డ్రైవర్ జహంగీర్ వద్ద క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటీ లాగే శనివారం రాత్రి బస్తేపూర్‌లో కొత్తిమీర లోడ్ కోసం వెళ్లారు. పొలం సమీపంలోని విద్యుత్ తీగల కింద వాహనం ఆపారు. లోడ్ అనంతరం వాహ నం పైకి ఎక్కి.. కవర్ కప్పుతున్న క్రమంలో పైన ఉన్న కరెంట్ తీగలు చేతికి తగిలి షాక్‌కు గురయ్యాడు. వెంటనే డ్రైవర్.. బాధితున్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతనుమృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి యూసుప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపా రు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
అనంతగిరికిపర్యాటకుల తాకిడి
అనంతగిరి: వికారాబాద్‌కు సమీపంలోని అ నంతగిరిగుట్టకు ఆదివారం పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెలవులు ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చారు. ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం సమీపంలోని అడవులె వ్యూ పాయింట్ వద్ద విహరిస్తూ సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు.

విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి