
పాడి రైతుల శ్రేయస్సే లక్ష్యం
కడ్తాల్: పాడి రైతుల శ్రేయస్సే విజయడెయిరీ లక్ష్యం అని పాలశీతలీకరణ కేంద్రం మెనేజర్ ప్రాణేశ్‌కుమార్, స్థానిక విజయ పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాల సేకరణ కేంద్రం వద్ద 120 మంది రైతులకు దీపావళి కానుకగా పాలక్యాన్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాల ఉత్పత్తి మరింత పెరగాలని, నాణ్యమైన పాలను పోసి అధిక ధర పొందాలని సూచించారు. రైతులకు అవసరమైన సదుపాయాలను ఎప్పటికప్పుడు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. సకాలంలో పాలబిల్లులు చెల్లించాలని, పశుగ్రాసం, దాణా పంపిణీ చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం డైరెక్టర్లు, రైతులు రాములు, రవీందర్‌రెడ్డి, వెంకట్‌రాములుగౌడ్, వెంకట్‌రెడ్డి, పాండు, మహేశ్,జంగారెడ్డి, సత్యం, రాములు, చంద్రయ్య,యాదయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.