కష్టపడ్డారు.. ఉన్నతికి చేరుకున్నారు | TSPSC Group 2 Final Results 2025 Career Power, Inspiring Stories Of Rural Youth From Government Jobs To Higher Positions | Sakshi
Sakshi News home page

కష్టపడ్డారు.. ఉన్నతికి చేరుకున్నారు

Oct 20 2025 9:47 AM | Updated on Oct 20 2025 12:10 PM

TSPSC Group 2 Final Results 2025 Career Power

గ్రూప్‌–2లో మెరిసిన ఉద్యోగులు 

జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. డీటీకి ఎంపికైన దేవేందర్‌

కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ.. ఏఎస్‌ఓగా ఉమ

మహేశ్వరం/కొత్తూరు: ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూనే.. మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కలగన్నారు. కష్టపడ్డారు. ఫలితం దక్కించుకున్నారు. వారిలో ఒకరు జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. డీటీకి ఎంపికగా, మరో ఇద్దరు కానిస్టేబుల్‌గా పనిచేస్తూ.. ఏఎస్‌ఓగా ఒకరు, ఎస్‌ఐగా  మరొకరు ఎంపికయ్యారు. నగరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తదితర అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకొన్నారు.

పేద రైతు కుటుంబంలో.. 
పేద రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశా లలో చదివాడు. గ్రూప్‌– 2లో రాష్ట్ర స్థాయిలో 171 ర్యాంకు సాధించి, డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యో గం సాధించాడు గిరిజన బిడ్డ దేవేందర్‌. మండల పరిధి పెద్దమ్మ తండా అనుబంధ నల్లచెర్వుతండా కు చెందిన కాట్రావత్‌ లక్ష్మీ– రాములు నాయక్‌ దంపతుల కుమారుడు దేవేందర్‌ నాయక్‌ శనివారం రెవెన్యూ అధికారుల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నాడు. వికారాబాద్‌ జిల్లాలో రెవె న్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు. ఇంతకు ముందే.. దేవేందర్‌ గ్రూప్‌– 3లో 305 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు సాధించారు. గ్రూప్‌– 4లో 141వ ర్యాంకు సాధించి, శంషాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్‌– 1లో 433 మార్కులు సాధించినప్పటికీ.. కొద్దిపాటి తేడాతో అదృష్టం చేజారింది. అయినా నిరుత్సాహం చెందకుండా.. డీటీ కొలువు సాధించాడు.

కానిస్టేబుల్‌గా కొనసాగుతూ..  
కొత్తూరు: కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌– 2లో ఉత్తమ ర్యాంకు సాధించి, సెక్రటేరియట్‌లో ఏఎస్‌ఓగా ఉన్నతస్థితికి చేరుకుంది. పట్టణానికి చెందిన గాలిగాని యాదయ్య మూడో కూతురు ఉమ.. చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. సర్కారు బడుల్లో విద్యనభ్యసించి గ్రూప్‌– 1, ఎస్‌ఐ, ఉద్యోగానికి పలుమార్లు పరీక్షలు రాసి కొద్దిపాటి మార్కులతో రాణించలేక పోయింది. ఆ తరువాత కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించింది. అయినప్పటికీ.. పట్టువదలక.. పోటీ పరీక్షలు రాసి.. గ్రూప్‌–2లో మెరిసింది. ప్రస్తుతం ఉమకేశంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది.

కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐగా..
యాచారం: ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ.. ప్రస్తుతం అదే శాఖలో ఎస్‌ఐగా ఉన్నతికి చేరుకుంది మండల పరిధి నందివనపర్తి అనుబంధ గ్రామం పిల్లిపల్లికి చెందిన అయ్యాగాని ప్రవళిక. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె.. బీపార్మసి పూర్తి చేసింది. తాజాగా వెలువడిన గ్రూపు– 2లో రాణించి, ఎస్‌ఐగా ఎంపిౖకైంది. గతంలో గ్రూప్‌– 4లో వార్డు ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రూప్‌– 1లో ఉద్యోగం సాధించడమే లక్ష్యమని పేర్కొంది. ప్రవళిక తల్లిదండ్రులు పాండు, శోభలు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement