
అడ్డా!
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఫాంహౌస్‌లే
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆహ్లాదాన్ని.. మనసుకు ఆనందాన్ని పంచాల్సిన విలాసవంతమైన ఫాంహౌస్‌లు.. అశ్లీలత, అసాంఘిక శక్తులకు అడ్డలుగా మారిపోతున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు మిరమిట్లు గొలిపే లైటింగ్స్ విరజిమ్ముతున్నాయి. డీజే సౌండ్, అర్థరాత్రి అందమైన భామల నృత్యాలతో హోరెత్తిపోతున్నాయి. ప్రమాదకరమైన కొకై న్, హెరాయిన్ వంటి డ్రగ్స్, గంజాయి, హుక్కా, ఖరీదైన విదేశీ మద్యం మత్తులో తేలియాడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో తరచూ రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు, వారి పిల్లలు పట్టుబడుతుండడం గమనార్హం. పోలీసులు తరచూ దాడులు చేస్తున్నా నిర్వాహకులు మాత్రం తమ ధోరణి మార్చుకోవడం లేదు.
వీకెండ్ పార్టీలు.. డ్రగ్స్ అమ్మకాలు
నగరానికి ఆనుకుని ఉన్న మొయినాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాద్‌నగర్, మంచాల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాల్లో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు భారీగా భూములు కొనుగోలు చేశారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఎగువ ప్రాంతాల్లో పచ్చని చెట్లు, ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వెయ్యికిపైగా ఫాంహౌస్‌లు ఉండగా, జంటజలాశయాల చుట్టు పక్కనే 700పైగా ఉన్నట్లు అంచనా. 111 జీఓ పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతి లేకపోవడంతో ధనవంతులు తమ వ్యవసాయ భూముల్లో విలాసవంతమైన క్లబ్బులు, రిసార్టులు ఏర్పాటు చేశారు. వీరిలో కొంతమంది వివాహ రిసెప్షన్లు, బర్త్‌డే వేడుకలు, వీకెండ్ పార్టీలకు అద్దెకిచ్చి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన పిల్లలు ఇక్కడ వాలిపోతుంటారు. బర్త్‌డేలు, ఇతర పార్టీల పేరుతో అర్థరాత్రి వరకు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేస్తూ మద్యం సేవిస్తుంటారు. స్వదేశీ మద్యానికి అనుమతి తీసుకుని గుట్టుగా విదేశీ మద్యాన్ని సేవిస్తున్నారు. ప్రమాదకరమైన డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. వీటి చుట్టే గంజాయి, డ్రగ్ పెడ్లర్స్ కూడా మాటు వేసి కూర్చొని ఉండటం, హత్యలు, అత్యాచారాలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
గేట్లు తట్టాలంటే పోలీసులకు వణుకే..
తమ ఫాంహౌసుల్లోకి ఎకై ్సజ్, సివిల్ పోలీసులు తనిఖీలకు రాకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కొంతమంది ప్రధాన గేటు, మెయిన్ డోరును రిమోట్‌తో ఆపరేట్ చేస్తున్నారు. ఇతరులు ప్రయత్నించినా తెరుచుకోకుండా ఖరీదైన తాళాలు బిగిస్తున్నారు. ఫాంహౌస్‌కు వచ్చివెళ్లే ప్రధాన రహదారి సహా దాని చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని తనిఖీ కోసం లోనికి వచ్చేందుకు యత్నించే పోలీసులను గేటు బయటే అడ్డుకుంటున్నారు. ప్రముఖ నేతలతో ఉన్నతాధికారులకు ఫోన్లు చేయించి, వచ్చిన వాళ్లను వెనక్కి పంపుతున్నారు. వికారాబాద్–చేవెళ్ల సరిహద్దులోని ఓ రిటైర్డ్ పోలీసు ఆఫీసర్‌కు చెందిన ఫాంహౌస్ సహా మొయినాబాద్ శివారు కేంద్రంగా వెలసిన ఓ రాజకీయ ప్రముఖుడి ఫాంహౌస్‌లు ఇందుకు నిత్య వేదికలుగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటి తలుపు తట్టేందుకు ఎకై ్సజ్, ఎస్‌ఓటీ పోలీసులు జంకుతుండటం గమనార్హం. గేట్లు దూకి బలవంతంగా లోపలికి వెళ్లిన పోలీసులపై వేట కుక్కలను వదులుతున్నట్లు తెలిసింది. పార్టీకి వచ్చి న అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేశారని, డబ్బులు డిమాండ్ చేశారని, తనిఖీలకు వెళ్లిన బృందాలపై ఉల్టా ఫిర్యాదు చేయిస్తున్నారు. దీంతో అటువైపు వెళ్లేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి సమయంలో తనిఖీ బృందాలకు అండగా నిలవాల్సిన ఉన్నతాధికారులు సైతం అందరి ముందే వాళ్లను నిలదీసి, కనీస వివరణ కూడా తీసుకోకుండా షోకాజ్ నోటీసులు జారీ చేస్తుండడం విశేషం.
రెండు రోజుల వ్యవధిలో రెండు ఘటనలు
ఏపీకి చెందిన ఓ ప్రముఖ ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ కంపెనీ తమ డీలర్ల కోసం మంగళవారం మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కె.చంద్రారెడ్డి (కేసీఆర్) రిసార్ట్‌లో ముజ్రా పార్టీ ఏర్పాటు చేసింది. ఎకై ్సజ్‌శాఖ నుంచి మద్యం సరఫరాకు అనుమతి తీసుకుని అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించింది. డయల్ 100కు కాల్ రావడంతో పోలీసులు రిసార్ట్స్‌పై దాడి చేసి 52 మంది డీలర్లు, 22 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బుధవారం రాత్రి మంచాల మండలం లింగంపల్లిలోని సప్తగిరి ఫాంహౌస్‌లో రేవ్‌పార్టీపై పోలీసులు దాడి చేసి అశ్లీల నృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది మహిళలు సహా 25 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉండడం గమనార్హం.
మందేసి, చిందేస్తున్న యువతీయువకులు
అశ్లీల, అసాంఘిక కార్యకలాపాలు
వీకెండ్ వచ్చిందంటే యథేచ్ఛగా జల్సా
తరచూ పట్టుబడుతున్న డ్రగ్స్, గంజాయి, విదేశీ మద్యం

అడ్డా!

అడ్డా!