
అనుమతి తప్పనిసరి
ఇబ్రహీంపట్నం: ఫాంహౌస్, రిసోర్ట్స్‌ల్లో నిర్వహించే ఫంక్షన్లకు తప్పనిసరి అనుమతులు తీసుకోవాలని డీసీపీ సునితారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్ ఆవరణలో శుక్రవారం ఫాంహౌస్, రిసార్ట్స్ యజమానులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ముజ్రా, రేవ్ తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వీకేండ్ పార్టీల్లో మద్యం, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాలను వినియోగించకుండా చూడాలన్నారు. ఇకపై ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌పై నిఘా ఉంటుందని, సమీప పోలీస్‌స్టేషన్లకు ఎలాంటి ఫంక్షన్లు నిర్వహిస్తున్నారో సమాచారం ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. వారం రోజుల్లో మహేశ్వరం, మంచాల పోలీస్‌స్టేషన్ పరిధుల్లో చోటుచేసుకున్న సంఘటనలపై చర్చించారు. ఫాంహౌస్, రిసార్ట్స్ యజమానులకు మార్గదర్శకాలను జారీ చేశారు. కార్యక్రమంలో ఏసీపీ కేపీవీ రాజు, సీఐలు మహేందర్‌రెడ్డి, సత్యనారాయణ, రవికుమార్, నందీశ్వర్, వేణు తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి