
సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి
గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామారావు
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరలో పూర్తి చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. కొంగరకలాన్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు ఇంటి అద్దె భృతి 24 శాతానికి పెంచాలని, త్వరలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టాలని తీర్మానించినట్లు చెప్పారు. పీఆర్‌సీ ప్రకటించి అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సంఘం భవనానికి స్థలం కేటాయించాలని కోరారు. అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో పర్యటించి హౌసింగ్ సొసైటీ సభ్యులను చేర్పించాలని సూచించారు. సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు పీసీ వెంకటేశ్, సహ అధ్యక్షులు నూతనకంటి వెంకట్, అలివేలు, బాలరాజుగౌడ్, జాయింట్ సెక్రెట్రీలు నాగేశ్వర్‌రావు, మహేశ్వరి, సైదమ్మ, శాంతిశ్రీ, మసూద్ అలీ పాల్గొన్నారు.