ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

Oct 18 2025 9:57 AM | Updated on Oct 18 2025 9:57 AM

ఉద్యో

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

మహేశ్వరం: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీఓ నిరంతరం పని చేస్తుందని యూనియన్‌ జిల్లా హడహక్‌ కమిటీ కన్వీనర్‌ ముజీబ్‌ హుస్సేన్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌, ఎంపీడీఓ, ఎస్టీఓ, పంచాయతీరాజ్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సభ్యత్వ నమోదును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి రావాల్సిన అలవెన్సులు, రాయితీలు ప్రతి ఉద్యోగికి అందే విధంగా చూస్తామని చెప్పారు. ఉద్యోగులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, వారికి రక్షణగా ఉంటామన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ సీనియర్‌ నాయకులు శ్రీధర్‌రెడ్డి, అశోక్‌, జావీద్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఆర్‌ చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం

మొయినాబాద్‌: అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్‌ చేసి ప్రాణాలను కాపాడుకుందామని 108 సిబ్బంది అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ కేంద్రంలో వారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుండెపోటు వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తులకు సీపీఆర్‌ చేసి, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించుకుందామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరికి గుండెపోటు వస్తుందో తెలియని పరిస్థితని, అలాంటి అపాయం వస్తే.. సీపీఆర్‌ చేయాలని పేర్కొంటూ.. ప్రత్యక్షంగా చేసి చూపించారు. అనంతరం ఆస్పత్రికి తరలించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది భూక్య శ్రీకాంత్‌, శ్యామప్ప, నర్సింహ్మ తదితరులు ఉన్నారు.

అరకొర బస్సులు.. ప్రయాణికుల పాటు్ల

విధిలేక ఒంటికాలిపై ఆడబిడ్డల పయనం

యాచారం: మహాలక్ష్మి పథకం పేరిట ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కానీ అందుకు తగిన విధంగా సర్వీసుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగి.. అవస్థల నడుమ ఆడబిడ్డలు ఒంటికాలిపై పయనిస్తూ.. ఇబ్బంది పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. పురుషులదీ అదే సమస్య. యాచారం– కందుకూరు రూట్లో సరిగా బస్సులు లేక.. అరకొర బస్సు ట్రిప్పులతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ రూట్లో ఉదయం, సాయంత్రం వేళలోరెండు మండలాల పరిధి గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులతో పాటు అనేక మంది యాచారం మండల కేంద్రం, ఇబ్రహీంపట్నం, నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికులు అధికంగా ఉన్నప్పటికీ.. సంస్థ అధికారులు సర్వీసులు, ట్రిప్పులు పెంచకపోవడంతో ప్రజలు నరక ప్రయాణం చేస్తున్నారు. ఫుట్‌బోర్డు ప్రయాణంతో ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ అధికారులు స్పందించి.. ఈ మార్గంలో అదనపు బస్సులు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

పట్టుదల ఉంటే.. విజయాలు మీవెంటే

●లక్ష్య సాధనకునిరంతరం శ్రమించాలి

●మోటివేషనల్‌ స్పీకర్‌ డాక్టర్‌ రవికుమార్‌

షాద్‌నగర్‌రూరల్‌: కృషి, పట్టుదల ఉంటే విజయాలు వెన్నంటే ఉంటాయని మోటివేషనల్‌ స్పీకర్‌ డాక్టర్‌ రవికుమార్‌ అన్నారు. పట్టణ సమీపంలోని నూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో.. గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీతాపోలె ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘స్వయం ఉపాధి నైపుణ్యాల అభివృద్ధి’ శిక్షణా కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. జీవిత గమనంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. విద్యార్థులు చదువులో రాణిస్తూ.. వృత్తి నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. చిన్నచిన్న విషయాలకు కుంగిపోకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే విజయతీరాలకు చేరుకుంటారని స్పష్టం చేశారు. లక్ష్య సాధనకు ప్రణాళికలను రూపొందించుకొని, నిరంతరం శ్రమించాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌ నీతాపోలె మాట్లాడుతూ.. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి 1
1/3

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి 2
2/3

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి 3
3/3

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement