
ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ
మంచాల: మండలం లింగంపల్లిలో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీపై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఇందులో పాల్గొన్న 33 మందిని అరెస్టు చేశారు. మంచాల సీఐ మధు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక సప్తగిరి ఫాంహౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా రేవ్ పార్టీ నిర్వహించారు. ఇందులో 25 మంది పురుషులు, 8మంది మహిళలు పాల్గొన్నారు. మద్యం సేవించి అశ్లీల నృత్యాలు చేస్తున్నానే సమాచారం సమాచారం అందడంతో మంచాల పోలీసులు దాడి చేశారు. వీరి నుంచి రూ.2,40,000 నగదు 11 వాహనాలు, 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని రిమాండ్‌కు తరలించారు.
పార్టీలో పాల్గొన్నది వీరే..
రుద్రశెట్టి సప్తగిరి, అనీల సురేష్‌కుమార్, పోరండ్ల మధుకర్, రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రాంపూరం రాజేశ్‌గౌడ్, కుండేటి విజయ్ శేఖర్ నాయకుడు, ఇమ్మిడిశెట్టి హరికృష్ణ, వల్లము రవీంద్రసాయి కుమార్, పురం సాయి కృష్ణ, పాపేర్తి రాజ్‌కుమార్, మూల మధుగౌడ్(మాజీ కార్పొరేటర్ ముఖేష్‌గౌడ్ తమ్ముడు), కొమ్మన సతీష్ కృష్ణ, నుగురు ప్రశాంత్, గట్టెవార్ సునిల్, బండారు రమేశ్, ప్రతాప్ గోపాల్, గడబోయిన బ్రహ్మ, జనంపేట్ బెక్కం గోపాలకృష్ణ, రంగు శ్యాం, వెలమ్మకన్ని లక్ష్మీ నర్సింహ, భరత్ ద్వాజ్, పోలుగుల కొండల ప్రవీణగౌడ్, శ్రీశైలం, డినావాయి శ్రీనివాస్, శ్రీనివాస్ సుబ్రహ్మణ్య తేజ, విజయ్ దిలికర్, చందంపేట్ అనంద్‌కుమార్ తదితరులు ఉన్నారు.
33 మంది రిమాండ్