
ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
మాడ్గుల: ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సూచించారు. గురువారం ఆమె మండల కేద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించారు. రౌడీషీటర్స్ హీస్టరీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్‌లను పరిశీలించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. గ్రామస్తుల సహకారంతో ఆయా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చొరవతీసుకోవాలన్నారు. ఠాణాకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మసులుకోవాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాడ్గుల సీఐ వేణుగోపాల్‌రావు, ఎస్‌ఐ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి