
తిరుపతిలో శంషాబాద్ భక్తుల ఇబ్బందులు
● ఓ కుటుంబం లగేజీ మాయం
● స్పందించిన రాజేంద్రనగర్ ఆర్‌డీఓ
● శంషాబాద్‌కు పయనమైన కుటుంబం
శంషాబాద్: తిరుమలలో శంషాబాద్‌కు చెందిన ఓ కుటుంబం లగేజీ మాయం కావడంతో నాలుగు రోజులు అక్కడ ఇబ్బంది పడింది. చివరకు అధికారుల సహకారంతో నగరానికి బయలుదేరారు. వివరాలు.. తిరుమలలో ఐదుగురు సభ్యులుగా కుటుంబం స్వామివారి దర్శనం చేసుకుంది. ఆ తరువాత వారి లగేజీ మొత్తం దొంగలు కొట్టేశారో.. లేక పొగొట్టుకున్నారో తెలియదు కానీ అయోమయంతో కొండ కిందికి చేరుకుని రైల్వేస్టేషన్‌కు వచ్చారు. నాలుగురోజులుగా వారిని గమనిస్తున్న రైల్వేపోలీసులు ఏం జరిగిందని ప్రశ్నించినా సరైన సమాధానం రావడం లేదు. వృద్దురాలికి, ఆమె కుమారుడికి మాటలు రావడం లేదు. ఓ మహిళ మాట్లాడినా అర్థం కావడం లేదు. పిల్లలు ఎంత అడిగా సరిగా మాట్లాడడం లేదు. అధికారులు కాగితం పెన్ను ఇవ్వడంతో శంషాబాద్ హి హీరోహోండా షాపు, పైన లగేజీలు పోయాయని రాసింది. దీంతో మూడు రోజులుగా రైల్వేపోలీసులే వారి భోజనం సమకూరుస్తున్నారు. ఆ కుటుంబాన్ని పంపేందుకు రైల్వేపోసులు సాక్షిని సంప్రదించి శంషాబాద్ డీసీపీ, రాజేంద్రనగర్ ఆర్‌డీఓ వెంకట్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు.. ఆర్‌డీఓ స్పందించి వారి రాకకోసం ఏర్పాట్లు చేయడంతో శనివారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరే బస్సులో వారిని రైల్వే పోలీసులు పంపారు.