
ముగిసిన ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు
రాజేంద్రనగర్: శివరాంపల్లి పాఠశాల ఆవరణలో మూడు రోజుల పాటు నిర్వహించిన 69వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఈ పోటీల్లో గెలుపొందిన విజేత జట్టులకు ఎంఈవో శంకర్ రాథోడ్, జీహెచ్‌ఎం భూక్య శ్రీను నాయక్, ఆదర్శ విద్యాలయ చైర్మన్ శ్రవణ్ కుమార్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ పడమటి శ్రీధర్ రెడ్డి, జోనల్ స్థాయి సెక్రటరీ గాంగ్య నాయక్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 210 టీమ్‌లు వివిధ క్రీడాలలో పాల్గొన్నారు. క్రీడలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జోనల్ స్థాయికి ఎంపిక చేశారు. జోనల్ స్థాయి పోటీలు ఆదివారం నుండి శివరాంపల్లి జడ్‌పీహెచ్‌ఎస్‌లో జరుగుతాయని జోనల్ సెక్రటరీ గాంగ్య నాయక్ తెలిపారు. మండలంలోని వివిధ సంఘాల నాయకులు, పీఆర్‌టీయూ అధ్యక్షుడు కడుమూరి సుదర్శన్, ఎస్‌టీయూ అధ్యక్షుడు కామిశెట్టి వెంకటయ్య, యూటీఎఫ్ అధ్యక్షుడు యాదగిరి, ఎస్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనార్దన చారి, పీడీలు జ్యోతి, రంగారెడ్డి, బాలస్వామి రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.