
‘డబుల్’ ఇళ్ల కేటాయింపు పత్రాల అందజేత
బంజారాహిల్స్: గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించి కోర్టులో కేసు కారణంగా ఆగిపోయి తిరిగి కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన పలువురు లబ్ధి దారులకు హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టాలు పంపిణీ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కలిసి పత్రాలను అందజేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు పథకంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకల్ గ్రామంలో ఇళ్ల నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది. హైదరాబాద్ జిల్లాకు చెందిన 1730 మంది లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ ప్రచురించగా వీరికి మంకల్ ఫేజ్–2 స్థానంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించారు. అందులో భాగంగా చార్మినార్, మలక్‌పేట, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. 75 మంది లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పట్టాలు అందజేశారు.