నేటి ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి రద్దు

Oct 6 2025 2:32 AM | Updated on Oct 6 2025 2:32 AM

నేటి

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ దుకాణాల కూల్చివేత సరికాదు జాగృతి అధ్యక్షురాలు కవితను కలిసిన నాయకులు బతుకమ్మకుంటలో ‘ఆపరేషన్‌ క్లీనింగ్‌’

సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

షాద్‌నగర్‌: దసరా సెలవులు ముగిసాయి.. పండుగకు స్వగ్రామాలకు వచ్చిన వారంతా పట్నానికి తిరుగు పయనం అయ్యారు. ఫలితంగా హైదరాబాద్‌ – బెంగళూరు 44వ నంబర్‌ జాతీయ రహదారి రద్దీగా మారింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌ వైపు వాహనాలు క్యూ కట్టాయి. షాద్‌నగర్‌ పరిధిలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద బారులు తీరి కనిపించాయి. వాహనదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా టోల్‌సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.

తుర్కయంజాల్‌: పెద్దలను వదిలి పేదలు, చిరు వ్యాపారులపై చర్యలు తీసుకోవడం దారుణమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్‌ అన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆదివారం మున్సిపల్‌ అధికారులు చిరు వ్యాపారుల గుడిసెలను తొలగించి, వారిని ఉపాధికి దూరం చేశారని ఆరోపించారు. ఏళ్లుగా రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న గుడిసెలను వేసుకుని, మధ్యాహ్న భోజనం, పండ్లను విక్రయిస్తున్నారని, అలాంటి వారికి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వనిత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని విమర్శించారు. రోజువారీ అప్పులు చెల్లిస్తూ, ఉపాధి పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీపీఎం, సీఐటీయూ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు ఈ.నరసింహ, సీహెచ్‌ ఎల్లేశ్‌, సత్యనారాయణ, యాదయ్య, కృష్ణ, రవి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

కందుకూరు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండు రంగారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ నాయకుడు అందుగుల సత్యనారాయణతో పాటు పలువురు ఆదివారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా సమస్యలపై నాయకులు, కార్యకర్తలు పోరాడాలని, జిల్లాలో జాగృతి బలోపేతం కోసం కృషి చేయాలని ఆమె నేతలకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు బండారి లావణ్య, కోల శ్రీనివాస్‌, అర్చన, సేనాపతి, బాబురావు, గణేష్‌ నాయక్‌, రవి నాయక్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

సాక్షి, సిటీబ్యూరో: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) ఆదివారం నుంచి ‘ఆపరేషన్‌ క్లీనింగ్‌’ ప్రారంభించింది. ఇన్‌స్పెక్టర్‌ బాలగోపాల్‌ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌), మాన్సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్‌ (ఎంఈటీ) సిబ్బంది బతుకమ్మ వేడుకల అనంతరం కుంటలో వదిలిన బతుకమ్మలను బయటకు తీస్తున్నారు. పువ్వులు చెరువులో కుళ్లిపోయి, నీటి కాలుష్యానికి కారణం కాకుండా తొలగిస్తున్నారు. బతుకమ్మలను తయారుచేయడానికి పూలను పేర్చిన ట్రేలు పెద్ద సంఖ్యలో ఈ చెరువులో ఉండటంతో వాటినీ బయటకు తీస్తున్నారు.

నేటి ప్రజావాణి రద్దు 1
1/1

నేటి ప్రజావాణి రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement