
గుణపాఠం చెప్పండి త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్
ఉరిమింది.. మెరిసింది.. కురిసింది
చేవెళ్ల: నియోజకవర్గవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసినా వర్షపు నీరు నిలిచిపోయాయి. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. తంగడపల్లి, మడికట్టు వద్ద ఉన్న వాగు బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహించింది. చేవెళ్లలోని నవచైనత్య పాఠశాలపై పిడుగు పడింది. రాత్రిపూట ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. భవనం గోడకు పగుళ్లు వచ్చాయి. మరోవైపు పంటలు నీటమునిగాయి.
చేవెళ్ల నియోజకవర్గంలో భారీ వర్షం

గుణపాఠం చెప్పండి త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్