వర్షపాతం ఇలా.. (మిల్లీమీటర్లలో.. ) | - | Sakshi
Sakshi News home page

వర్షపాతం ఇలా.. (మిల్లీమీటర్లలో.. )

Oct 6 2025 2:32 AM | Updated on Oct 6 2025 2:32 AM

వర్షప

వర్షపాతం ఇలా.. (మిల్లీమీటర్లలో.. )

జిల్లా సాధారణం కురిసింది అధిక శాతం సాధారణం కురిసింది అధిక శాతం

హైదరాబాద్‌ 627.2 917.9 46.0 615.4 825.5 34.0

రంగారెడ్డి 603.7 840.3 50.0 530.4 701.8 32.0

మేడ్చల్‌–మల్కాజిగిరి 547.7 822.3 39.0 598.6 722.2 21.0

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో భూగర్భ జలమట్టం పెరిగింది. ప్రస్తుత సీజన్‌లో సాధారణ వర్షపాతం కంటే 45 శాతం ఎక్కువ నమోదు కావడంతో భూగర్భజలాలు ఉబికి వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే సగటున రెండు నుంచి మూడు అడుగులు పెరిగినట్లు భూగర్భ జలాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే మేడ్చల్‌– మల్కాజిగిరిలో సగటున 2.64 అడుగులు, రంగారెడ్డిలో 1.94 అడుగులు, హైదరాబాద్‌లో 0.75 అడుగులు పెరిగాయి. నగరంలో సగటు భూగర్భ నీటిమట్టం 11.94 మీటర్లు కాగా మే చివరి నాటికి మరో పది అడుగుల లోతుకు పడిపోయాయి. ఈ వర్షాకాల సీజన్‌లో ముందస్తు వర్షాలు ప్రారంభమైనప్పటికీ.. మొదటి రెండు నెలలు సాధారణ కంటే లోటు వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత వర్షాలు ఊపందుకున్నాయి. వరుసగా కుండపోతగా కురిశాయి.

వేసవిలో 20 మీటర్ల లోతుకు

వేసవిలో భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరులోగా చాలా ప్రాంతాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది సాధారణం కన్నా 29 శాతం అధికంగా వర్షపాతం నమోదైనా కాంక్రీట్‌ కట్టడాలతో ఆ వరద భూమిలోకి ఇంకే పరి స్థితి లేకపోవడం, విచ్చలవిడిగా బోర్ల తవ్వకం, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కారణంగా భూగర్భజలాలు పాతాళంలోకి చేరాయి. ఎండా కాలంలో పెరుగుతున్న ఉష్టోగ్రతలకు తోడు వర్షపు నీటి సంరక్షణలో నిర్లక్ష్యం భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఓఆర్‌ఆర్‌ వరకు ఉన్న 46 మండలాల్లో 57 ఫిజో మీటర్ల ద్వారా వేసవిలో పరిస్థితిని రాష్ట్ర భూగర్భ జల శాఖ విశ్లేషించింది. ఈ పరిశీలనలో ఏటికేడు నగరంలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోతున్నట్లు గుర్తించింది. తాజాగా వర్షాకాల సీజన్‌లో భూగర్భ జలాల పరిస్థితి సాధా రణానికి చేరాయి. ఈసారి సీజన్‌లో గత ఏడాదితో పోల్చితే 16 శాతం వర్షాలు అధికంగా కురిసినట్లు వాతావరణ శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చివరి పక్షం రోజుల్లో మేఘాల విస్ఫోటంతో ఆకాశానికి చిల్లులు పడిన చందంగాకుండపోత కురిసింది.

2025

గత ఏడాది కంటే రెండు అడుగులపైనే

ఈ సీజన్‌లో భారీగా కురిసిన వర్షాలు

వర్షపాతం ఇలా.. (మిల్లీమీటర్లలో.. )
1
1/1

వర్షపాతం ఇలా.. (మిల్లీమీటర్లలో.. )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement