హలో ఆఫీసర్‌! | - | Sakshi
Sakshi News home page

హలో ఆఫీసర్‌!

Sep 19 2025 6:17 AM | Updated on Sep 19 2025 6:17 AM

హలో ఆఫీసర్‌!

హలో ఆఫీసర్‌!

హలో ఆఫీసర్‌!

సాక్షి, సిటీబ్యూరో: అది గురువారం ఉదయం.. జలవిహార్‌లోని ఆడిటోరియం.. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అప్పుడే ట్రాఫిక్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ సమ్మిట్‌–2025ని ప్రారంభించారు. ఆయనకు వీడ్కోలు పలికిన పోలీసు అధికారులు తదుపరి కార్యక్రమం నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నోటి వెంట ‘హలో ఆఫీసర్‌’ అనే మాట వచ్చింది. ప్రొటోకాల్‌ ప్రకారం అందరు అధికారులూ ముందుగానే అక్కడికి చేరుకున్నారు. అందరి పలకరింపులు పూర్తయ్యాయి. ఈ సమయంలో కొత్తగా ఎవరు వచ్చారా? అన్నట్లు ఉన్నతాధికారుల కళ్లు ఆ ‘ఆఫీసర్‌’ కోసం వెతికాయి. ఆ సమీపంలో యూనిఫాంలో నిల్చున్న చిన్నారి నడింపల్లి వశిష్ట రామ్‌ని చూసి మురిసిపోయారు. జలవిహార్‌ ఎండీ ఎన్వీ రామరాజు ట్రాఫిక్‌ సమ్మిట్‌ నేపథ్యంలో తన మనవడు వశిష్ట రామ్‌కు పోలీసు యూనిఫాం వేసి తీసుకువచ్చారు. కొత్వాల్‌ ఆనంద్‌తో పాటు ఉన్నతాధికారులూ ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని సరదాగా మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement