
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
షాబాద్: విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతిచెందిన ఘటన షాబాద్ పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఊబగుంట గ్రామానికి చెందిన బుడ్డమోళ్ల చంద్రయ్య(60) రోజు మాదిరిగానే ఉదయం పొలానికి వెళ్లాడు. వరి పంటకు నీరు పెట్టేందుకు మోటారు ఆన్ చేస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో చేవెళ్ల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు దరశథ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు.