
మెరుగైన సేవలు అందించండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సంబంధిత వైద్యులకు సూచించారు. గురువారం ఆయన శివరాంపల్లిలోని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సరూర్‌నగర్ యూపీహెచ్‌సీ డాక్టర్‌గా తడకంటి శృతి, రాజేంద్రనగర్ మండలం పాండురంగానర్ యూపీహెచ్‌సీ డాక్టర్‌గా డి.శ్వేత, అబ్దుల్లాపూర్‌మెట్ యూపీహెచ్‌సీ డాక్టర్‌గా కె.శ్రీనివాస్, మీర్‌పేట యూపీహెచ్‌సీ డాక్టర్‌గా అఖేల శ్రీనిధి, ఉప్పర్‌పల్లి యూపీహెచ్‌సీ డాక్టర్‌గా హాస్పా ఫాతిమా, శేరిలింగంపల్లి యూపీహెచ్‌సీ డాక్టర్‌గా ఎండీ అవైస్‌కు ఆయన నియామక పత్రాలను అందజేశారు. కొత్తగా విధుల్లో చేరనున్న డాక్టర్లు అంకింత భావంతో పనిచేయాలని సూచించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో రూ.52 వేల జీతంతో ఏడాదిపాటు ఈ డాక్టర్లు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, పరిపాలనాధికారి మహ్మద్ షఫీయుద్దీన్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ అక్రం, సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్