
74 కి. మీ. దూరం కొట్టుకుపోయి.. నాలాలో గల్లంతైన అర్జున్
● వలిగొండ వద్ద మూసీలో మృతదేహం
● రామా కోసం గాలిస్తున్న డీఆర్‌ఎఫ్ బృందాలు
నాంపల్లి: నగరంలోని అఫ్జల్‌సాగర్ నాలా వరద నీటిలో అయిదు రోజుల క్రితం గల్లంతైన మాన్గార్ బస్తీ యువకుడు అర్జున్ (26) నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద మూసీలో మృతదేహమై తేలాడు. ఈ నెల 14న రాత్రి మామా అల్లుళ్లు రామా, అర్జున్ అఫ్జల్‌సాగర్ నాలాలో గల్లంతైన విషయం తెలిసిందే. వీరి కోసం జీహెచ్‌ఎంసీ, హైడ్రా బృందాలు గాలింపు చేపట్టాయి. అయిదు రోజుల తర్వాత నల్లగొండ జిల్లా వలిగొండ సమీపంలోని మూసీ నదిలో ఉన్నట్లు సహాయక సిబ్బంది కనుగొన్నారు. రామా (25) మృతదేహం లభించలేదు. డీఆర్‌ఎఫ్ బృందాలు రామా ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. అర్జున్ మృతదేహం గ్రేటర్ హైదరాబాద్ నుంచి 74 కిలో మీటర్ల దూరం కొట్టుకుపోయింది. మృతుడు అర్జున్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
పీవీ నర్సింహారావు
ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై గురువారం రాత్రి కారు బోల్తా పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళుతున్న ఓ కారు పిల్లర్ నంబర్ 162 వద్దకు రాగానే వర్షం కారణంగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ సంఘటనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. అనంతరం రాకపోకలను పునరుద్ధ్దరించారు. ఘటనలో ఎవరికి ఎగాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.