కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి

Sep 19 2025 6:15 AM | Updated on Sep 19 2025 6:17 AM

కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి కొందుర్గ్గు తహసీల్దార్‌గా అజాం అలీ కొందుర్గు: కొందుర్గు తహసీల్దార్‌గా అజాం అలీ గురువారం విధుల్లో చేరారు. కేశంపేట నుంచి బదిలీపై వచ్చిన ఆయన డిప్యూటీ తహసీల్దార్‌ రాకేశ్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అజాం అలీ మాట్లాడుతూ.. మండల పరిధిలోని భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఇందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. అరుణాచల్‌ టీ–20లో షాద్‌నగర్‌ యువకుడి సత్తా

సీపీ అవినాష్‌ మహంతి

శంకర్‌పల్లి: పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగిరం చేసి సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలని సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి సూచించారు. గురువారం ఆయన శంకర్‌పల్లి ఠాణాను రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌, నార్సింగి ఏసీపీ రమణ గౌడ్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్‌ కేసులు, రికార్డు లు, నేరాలు, శాంతిభద్రతలపై సమీక్షించి, ప లు సూచనలు ఇచ్చారు. నూతనంగా నిర్మి స్తు న్న పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం సీపీ అవినాష్‌ మహంతి మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. హెడ్‌ కానిస్టేబుల్స్‌కు ఇచ్చే కేసులు, ఆయుధాలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌గౌడ్‌ శంకర్‌పల్లిలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందని మరికొంత మంది సిబ్బందిని కేటాయించాలని కోరగా.. ఇందుకు సీపీ సానుకూలంగా స్పందించారు.

ఆల్‌ రౌండర్‌గా ప్రతిభ చాటిన సునీల్‌ యాదవ్‌

షాద్‌నగర్‌రూరల్‌: అరుణాచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అరుణాచల్‌ టీ–20 చాంపియన్‌ షిప్‌ క్రికెట్‌ పోటీల్లో ఎలికట్ట గ్రామానికి చెందిన బద్దుల సునీల్‌యాదవ్‌ సత్తాచాటాడు. గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ బద్దుల కృష్ణయ్య, విజయ దంపతుల కుమారుడు సునీల్‌యాదవ్‌ టవాంగ్‌ టైటాన్‌–2025 టీంకు ఎంపిక అయ్యాడు. అరుణాచల్‌ టీ–20 చాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఏడు లీగ్‌ మ్యాచ్‌లు, ఒక సెమీస్‌లో ఆల్‌ రౌండర్‌గా ప్రతిభను కనబరిచాడు. టవాంగ్‌ టైటాన్‌ జట్టు ఫైనల్‌కు చేరి తుది పోరులో రన్నరప్‌ జట్టుగా నిలిచింది. తెల్లాపూర్‌లోని స్పోర్ట్స్‌ అండ్‌ స్పా ర్క్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న సునీల్‌యాదవ్‌ డిసెంబర్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లో నిర్వహించనున్న రంజీ మ్యాచ్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. భవిష్యత్‌లో ఐపీఎల్‌ ఆడాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.

జ్యూస్‌ తాగుతూ

కుప్పకూలిన యువకుడు

ఆస్పత్రికి తరలించేలోపే మృత్యువాత

ఇబ్రహీంపట్నం రూరల్‌: జ్యూస్‌ తాగుతుండగా గుండెపోటు రావడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పల్లిపాడుకు చెందిన మేడ ఏకలవ్య(30) ఇబ్రహీంపట్నంలోని తన స్నేహితు డు ఆకాష్‌పటేల్‌ వద్ద ఉంటున్నాడు. యూకే లో ఉండే ఏకలవ్య ఉద్యోగం పోవడంతో హైదరాబాద్‌ వచ్చాడు. అప్పటినుంచి జాబ్‌ కోసం ట్రై చేస్తున్నాడు. జ్యూస్‌ సెంటర్‌ వద్ద కింద పడిపోయిన అతన్ని పోలీసులు పెట్రోలింగ్‌ వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి 1
1/3

కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి

కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి 2
2/3

కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి

కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి 3
3/3

కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement