
దేశ రక్షణలో యువత కీలకం
మొయినాబాద్ రూరల్: దేశ రక్షణలో యువత కీలకమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హిమాయత్‌నగర్ చౌరస్తాలోని స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం నిర్వహించిన ఇన్వెస్టించర్ కార్యక్రమ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే దేశభక్తితో పాటు రాజకీయాలపై మక్కు వ పెంచుకోవాలన్నారు. దేశ భద్రతలో భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధా న స్వామీజీ సుక్‌వల్లభ్, ప్రిన్సిపల్ ప్రవీణ్‌కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్