
సిబ్బంది లేక ఇబ్బంది
ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించింది. జనాభాకు అను గుణంగా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారిని నిత్యం శుభ్రం చేస్తున్నా కాలనీల్లో మాత్రం వారం పది రోజులకు ఒకసారి అంతర్గత రోడ్లను శుభ్రం చేస్తున్నారు. కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో సరైన కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే నిలుస్తోంది. ఏళ్లక్రితం నిర్మించిన మురుగు కాలువలు దెబ్బతినడంతో నీరు సాఫీ గా వెళ్లకుండా రోడ్లపైకి చేరుతోందని స్థానికులు తెలపారు. ఇంకా ఏడు కిలోమీటర్ల దూరం మురుగు కాలువలు నిర్మించాల్సిఉందని అధికారులు చెబుతున్నారు.