
4, 5 తేదీల్లో కేవీపీఎస్ శిక్షణ తరగతులు
తుర్కయంజాల్: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల 4, 5 తేదీల్లో పురపాలక సంఘం పరిధి ఎన్‌ఎస్‌ఆర్ నగర్‌లో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోడ సామేల్, మస్కు ప్రకాష్ తెలిపారు. రాగన్నగూడలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించా రు.శిక్షణ తరగతులకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జె. ఆశీర్వాదం, యాదగిరి, జంగయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.
ఆ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
షాద్‌నగర్‌రూరల్: అనుమతులు లేకుండా కొనసాగుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్‌చౌహాన్ డిమాండ్ చేశారు. పట్టణంలోని నారాయణ పాఠశాలవద్ద సోమవారం ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణ, శ్రీచైతన్యవంటి కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనీస వసతులను కల్పించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో బుక్స్, నోట్‌బుక్స్, యూనిఫాం విక్రయిస్తూ తల్లిదండ్రుల నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నాని ఆరోపించారు. విద్యను వ్యా పారంగా మారుస్తున్న విద్యా సంస్థల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సాయిచౌహాన్, విజయ్‌కుమార్, గణేశ్, వంశీ పాల్గొన్నారు..
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
మొయినాబాద్: ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమనేత దేశమొళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మున్సిపల్ కేంద్రంలో ఉద్యమకారులు రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని విమర్శించారు. ఉద్యమకారులను మరవద్దనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు మహిపాల్, నాయకు లు కుమ్మరి రమేష్, భిక్షపతి, మధు, అవినాష్, ముకుందరెడ్డి, బన్సీలాల్, రత్నం, కేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
మరకత శివాలయం
సందర్శన
శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన శ్రీ బ్రహ్మాసూత్ర మరకత శివాలయా న్ని సోమవారం సినీ నటుడు బాలాజీ దర్శించుకున్నారు. స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మరకత శివాలయం ఎంతో అద్భుతంగా ఉందని, సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటానని తెలిపారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఆల య చైర్మన్ గోపాల్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్‌రాజు పాల్గొన్నారు.

4, 5 తేదీల్లో కేవీపీఎస్ శిక్షణ తరగతులు

4, 5 తేదీల్లో కేవీపీఎస్ శిక్షణ తరగతులు

4, 5 తేదీల్లో కేవీపీఎస్ శిక్షణ తరగతులు