
చెత్త.. మురుగు
అస్తవ్యస్తంగా మున్సిపాలిటీలు
పహాడీషరీఫ్: పెద్ద ఎత్తున మురికివాడలు కలిగిన జల్‌పల్లి మున్సిపాలిటీలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదు. చాలా బస్తీల్లో పైప్‌లైన్లు లేకపోవడంతో ప్రజలు రింగ్‌లు వేసుకు న్నారు. వ్యర్థజలాలు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో కొన్ని బస్తీల్లో ఇళ్ల మధ్య పారుతున్నాయి. స్థానికులను అనారోగ్యం పాల్జేస్తున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగి 28 వార్డులతో కూడిన ఈ మున్సిపాలిటీలో ప్రైవేట్ ఆటోల ద్వారా రోజు విడిచి రోజు చెత్తను సేకరిస్తున్నారు. జల్‌పల్లి చెరువు పరిసరాల్లో కాటేదాన్‌కు సంబంధించిన కంపెనీల నిర్వాహకులు వ్యర్థాలను తీసుకొచ్చి రాత్రి పూట పడేసి పోతున్నారు. ప్రధాన నిత్యం శుభ్రం చేస్తున్నా అంతర్గత బస్తీల్లో మాత్రం మూడు నాలుగు రోజులకోసారి ఊడుస్తున్నారు.
లోపించిన పారిశుద్ధ్యం
కంపుకొడుతున్న కాలనీలు
రోగాల బారిన స్థానికులు
మున్సిపాలిటీలను పారిశుద్ధ్య సమస్య పట్టి పీడిస్తోంది. రోడ్లపక్కన చెత్త కుప్పలుగాపేరుకుపోయి కాలనీలు కంపు కొడుతున్నాయి. నిత్యం వీధులను శుభ్రం చేయాల్సి ఉండగా సిబ్బంది కొరతతో వారం పది రోజులకోసారి ఊడుస్తున్నారు. ఇంటింటికీ జరగాల్సిన చెత్త సేకరణ సైతం సరిగా
జరగడం లేదు. దీంతో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే పడేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపైనే, ఇళ్ల మధ్య నుంచే మురుగునీరు ప్రవహిస్తోంది. వర్షాకాలం కావడంతో ఈగలు, దోమలు వ్యాపించి
వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని
స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

చెత్త.. మురుగు

చెత్త.. మురుగు