
విద్యుదాఘాతంతో గేదెలు మృతి
హయత్‌నగర్: గాలి వానకు విద్యుత్ తీగలు తెగిపడి రెండు గేదెలు మృతి చెందిన సంఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగనూరులో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. టెలిఫోన్ కాలనీలో తొర్రూరుకు చెందిన మేకం నాగయ్య తన రెండు గేదెలను కట్టేసి ఉంచాడు. మంగళవారం సాయంత్రం వచ్చిన గాలి వానకు దగ్గరలోని విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఒక గేదె తీగలకు తాకి షాక్‌కు గురై కిందపడింది. అది చూసిన మరో గేదె దాని దగ్గరకు వచ్చింది. దీంతో రెండు షాక్‌తో మృతి చెందాయి. సుమారు రూ.3 లక్షలు నష్ట పోయినట్లు రైతు లబోదిబోమంటున్నాడు.