
సిగ్గుపడాల్సింది పోయి దాడులు చేస్తారా
షాద్‌నగర్ రూరల్: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై బీఆర్‌ఎస్ నాయకులు సిగ్గు పడాల్సిందిపోయి దాడులు చేస్తామని మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన కన్హశాంతి వనంకు వెళ్తున్న ఆయనకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారు ఎవరైనా ప్రభుత్వం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. అనంతరం ఆయన జూనియర్ కళశాల భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కళశాల నిర్మాణం ఓ మహత్తర కార్యక్రమని ఎమ్మెల్యే గొప్ప ఆశయంతో ముందుకు సాగుతున్నారని శభాష్ శంకర్ అంటూ అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్ అలీఖాన్‌బాబర్, నాయకులు తిరుపతిరెడ్డి, రఘునాయక్, ఎండీ.ఇబ్రహీం, కృష్ణారెడ్డి, బస్వం, మోహన్, ముబారక్‌అలీ, మురళీమోహన్, సీతారాం, అశోక్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు