
విద్యతోనే అంతరాలు లేని సమాజం
మంచాల: విద్య సమాజాభివృద్ధికి తోడ్పాటునిచ్చేలా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న పనులు, బోధన తీరు, ఉపాధ్యాయుల కృషిని తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ప్రజల మధ్య అంతరాలు తొలగాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం, ఉపాధ్యక్షురాలు మంగ, సభ్యులు నాగమణి, ధనమూర్తి, జగన్నాథ్ ఆరుట్ల ప్రధానోపాధ్యాయుడు గిరిధర్ గౌడ్, సుప్రియ, మోహన్ గౌడ్, పేరెంట్స్ కమిటీ సభ్యులు భాస్కర్, రాజు, ఎం.డీ.జానీ పాష, జంగయ్య, జంగయ్య, మల్లేశ్, పార్వతి, జ్యోతి, ఉపాధ్యాయులు పాపిరెడ్డి, కిషన్ చౌహాన్, శ్రీకాంత్, జహీర్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ నర్సింహారెడ్డి