
సెట్టింగ్‌తో సెటిల్‌మెంట్!
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం
అవన్నీ అటకెక్కిపోయాయి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసుల సివిల్ వ్యవహారాల పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ 2010 నవంబర్ 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఆరోపణ, ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అప్పట్లో రాచకొండ లేకపోవడంతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసు కమిషనర్ అధ్యక్షుడిగా, ఐజీ స్థాయి అధికారులైన అదనపు కమిషనర్ (సమన్వయం), అదనపు కమిషనర్ (నేరాలు) సభ్యులుగా, సైబరాబాద్ కమిషరేట్ విషయానికి వస్తే అధ్యక్షుడిగా పోలీసు కమిషనరే ఉన్నప్పటికీ సభ్యులుగా పరిపాలన విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు, క్రైమ్ డీసీపీ వీటిని ఏర్పాటు చేశారు. ఆపై ఉన్నతాధికారులు అనేక సందర్భాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లకు (ఎస్‌ఓపీ) రూపమిచ్చి వెబ్‌సైట్లలో పొందుపరిచారు. కాలక్రమంలో ఇవన్నీ అటకెక్కిపోవడంతో ఠాణాల్లో సెటిల్‌మెంట్లు కొనసాగుతున్నాయి.
● ‘పోలీసుస్టేషన్లు సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా మారాయి. వీటిని సివిల్ పంచాయితీలకు కేంద్రాలుగా మార్చారు. సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పినా బెదిరింపులకు దిగుతూ ఏదో ఒక క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు’
● రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాగోలు పోలీసుస్టేషన్‌లో నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి.
● పీఎస్‌లే కేంద్రంగా పంచాయితీలు
● ఫలితాలివ్వని ఎస్‌ఓపీలు, మానిటరింగ్ కమిటీలు
● హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి తెరపైకి