
సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా
యాచారం: గ్రామాల్లో సీసీ కెమెరాలుంటే 24 గంటల పాటు పోలీస్ బందోబస్తు ఉన్నట్లేనని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని నస్దిక్‌సింగారంలో దాతల సహకారంతో వివిధ చోట్ల బిగించిన పది సీసీ కెమెరాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలుంటే ఎంతో రక్షణ ఉంటుందన్నారు. గ్రామాల్లోని యువత, రాజకీయ వేత్తలు, ఉద్యోగులు సమష్టిగా కలిసి సీసీ కెమెరాల బిగింపు కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ మధు, గ్రామస్తులు పాండురంగారెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీశైలం, గాలయ్య పాల్గొన్నారు.
ఆకట్టుకున్న అభ్యుదయ్ డే
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ) ఆధ్వర్యంలో జరిగిన మేనేజ్‌మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అభ్యుదయ్ డే బుధవారం ముగిసింది. గత 18న ప్రారంభించిన ఈ కార్యక్రమం పలు ఉపయుక్తమైన వర్క్‌షాప్స్, ఇంటరాక్టివ్ సెషన్స్, ప్రజెంటేషన్స్‌తో విద్యార్థులను ఆకట్టుకుంది. టీసీఎస్ సంస్థ హెడ్ చల్లా నాగ్, ఎలికో హెల్త్‌కేర్ సర్వీసెస్ లిమిటెడ్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వనితా దట్ల, స్మార్ట్ ఫార్మా 360 సీఈఓ సహ వ్యవస్థాపకురాలు సాకేత, న్యాయవాది మోబాష్షీర్ సర్వర్, కెనడాలోని డల్హౌసీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ స్టీఫెన్ మెచౌలన్ తదితర దేశ విదేశీ ప్రముఖులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శులు
అందుబాటులో ఉండాలి
జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్
మహేశ్వరం: పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ తెలిపారు. బుధవారం ఆయన మండల పరిధిలోని మెహబ్బత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను, ప్రాథమిక పాఠశాల, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా డీపీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా తగు చొరవ చూపాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి మైథిలి ఉన్నారు.

సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా

సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా