
కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలి
కొత్తూరు: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.25 వేలు ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ విభాగం జిల్లా అధ్యక్షుడు రమావత్ సక్రునాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పలువురు కార్మికులతో కలిసి కొత్తూరు మున్సిపల్ కమిషనర్ బాలాజీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలన్నారు. అంతేకాకుండా కార్మికులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కాకుండా, ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే పనులు చేయించాలన్నారు. కార్మికులకు సబ్బులు, నూనె, చీపుర్లు, గ్లౌస్‌లు, మాస్కులు ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వారంతపు సెలవులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు సంజీవకుమార్, జంగయ్య, రోజ, దేవమ్మ, అంజమ్మ, మంజుల, సుజాత, ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ వర్కర్స్ సంఘం
జిల్లా అధ్యక్షుడు సక్రునాయక్