
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● త్వరలోనే సీఎం చేతులమీదుగా కొహెడ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన ● ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో సోమవారం గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు సంబంధించిన కార్యక్రమాలతో పాటు త్వరలో చేపట్టబోయే కొహెడ మార్కెట్ నిర్మాణ ప్రాజెక్టు పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక వసతులతో కోహెడలో నిర్మించబోయే ఆసియాలో అతిపెద్ద మార్కెట్ నిర్మాణానికి త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుందని పేర్కొన్నారు. కోహెడ మార్కెట్ నిర్మాణం పూర్తయితే ఉద్యోగ, ఉపాఽధి అవకాశాలు లభించడంతో పాటు రైతులు, వ్యాపారులు, ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందన్నారు. మార్కెట్‌కి వచ్చే ప్రతి రైతుకు న్యాయం చేసేలా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. అధిక కమీషన్లు వసూలు చేసే మార్కెట్ వ్యాపారులను బ్లాక్ లిస్టులో పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు పాలకవర్గంతో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి మహ్మద్ రియాజ్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్.శ్రీనివాస్, వైస్ చైర్మన్ భాస్కర్‌చారి, డైరెక్టర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.