
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
● జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ పద్మావతి
యాచారం: విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో రైతులను మోసం చేస్తే జైలు శిక్ష తప్పదని జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ పద్మావతి హెచ్చరించారు. బుధవారం ఆమె మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువులు విక్రయించే దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఏ ధరకు విత్తనా లు, ఎరువులు అమ్ముతున్నారు, ధరలు ఎలా ఉన్నా యి, రైతులకు రసీదులు ఇస్తున్నారా.? కాలం చెల్లిన విత్తనాలను, ఎరువులను రైతులకు విక్రయిస్తున్నా రా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాపారులు అధిక లాభార్జన ఆశతో రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోళ్లపై రైతులకు వెంటనే రసీదులు ఇవ్వాలని సూచించారు. స్టాక్‌బోర్డులు, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌పోర్స్ సీఐ ముద్‌రాస్ అలీ, సీడ్స్ సర్టిఫికేషన్ అధికారి లావణ్య, యాచారం మండల వ్యవసాయాధికారి రవినాథ్ పాల్గొన్నారు.
ఫెర్టిలైజర్ షాపుల తనిఖీ
మాడ్గుల: మండల స్థాయి అధికారులు రైతులకు అందుబాటులో ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ పద్మజ అన్నారు. బుధవారం ఆమె మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. పంటల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ అధికారి లావణ్య, ఎస్‌ఓటీ అధికారులు ముదస్సిర్ అలీ, వ్యవసాయ అధికారి అరుణకుమారి తదితరులు ఉన్నారు.