
మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు
శంకర్‌పల్లి: మండల పరిధిలోని చందిప్ప మరకత శివాలయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కోడలు సుహాసిని సందర్శించారు. బుధవారం ఆమె ఆలయంలోని మరకత శివలింగానికి సమీప బంధువుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెకు(నీలి రంగు చీర ధరించిన) ఆలయ గౌరవ అధ్యక్షుడు సదానందంగౌడ్, చైర్మన్ గోపాల్‌రెడ్డి, ప్రధాన అర్చకుడు సాయిశివలు శాలువాతో సత్కరించారు. మరకత శివాలయాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దర్శన్‌గౌడ్, అనంత్‌రెడ్డి పాల్గొన్నారు.