
సకాలంలో రుణాలు చెల్లించాలి
చేవెళ్ల: సొసైటీ బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని నాబార్డ్ డీసీఓ సుధాకర్, డీడీఎం హర్ష, డీసీసీబీ ఎఫ్‌ఎల్సీ లక్ష్మీకాంత్, డీసీఓ నాగేశ్వర్ అన్నారు. చేవెళ్ల సహకారం సంఘం కార్యాలయంలో బుధవారం సోసైటీ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి అధ్యక్షతన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకోసం పనిచేసే సోసైటీలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా రైతులపైనే ఉందన్నారు. మార్టిగేజ్ ద్వారా భూములపై అందించే రుణాల పరిమితిని పెంచుతున్నాట్లు స్పష్టంచేశారు. రుణాల చెల్లింపులో ఉత్తమ ఖాతాదారులుగా ఎంపికై న మధుసుధన్‌రెడ్డి, గిరీష్‌రెడ్డి, ఆనంద్‌ను సన్మానించారు. కార్యక్రమంలో సొసైటీ బ్రాంచ్ మేనేజర్ బాలకృష్ణ, కార్యదర్శి వెంటకయ్య, డైరెక్టర్లు మధుసుధన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్యామలయ్య, నర్సింలు, రాములు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాబార్డ్ డీసీఓ సుధాకర్, డీడీఎం హర్ష
సొసైటీ బ్యాంకుల ఉత్తమ ఖాతాదారులకు సన్మానం