
కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
నిబంధనల సాకుతో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని.. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మార్కెట్ యార్డుకు చేరుకుని ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలసుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మార్కెట్ యార్డు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని లేదంటే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాంపాల్‌నాయక్, మాజీ వైస్ చైర్మన్ దుర్గయ్య, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు విక్రంరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పద్మ అనిల్, లక్ష్మణ్, భగీరథ్, మహేశ్, శ్రీధర్, చెన్నకేశవులు, పెద్దయ్యయాదవ్, రెడ్యానాయక్, కుమార్, ప్రభాకర్, అమర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.