
సైనికుల త్యాగాలు మరువలేనివి
కందుకూరు: జాతీయవాదాన్ని గుండెల నిండా నింపుకొని పోరాడుతున్న మన సైనికుల త్యాగాలు మరువలేనివని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎన్.అంజిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. యుద్ధంలో గెలవడమే కాదు ప్రత్యర్థులను సైతం తన వైపు తిప్పుకొన్న గొప్ప నేత ప్రధాని మోదీ అని కొనియాడారు. భారత్ ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక శక్తిగా ఎదగడానికి మోదీ పాలనతోనే సాధ్యమైందన్నారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్, కన్వీనర్ ఎల్మటి దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు కడారి జంగయ్య మాట్లాడుతూ.. ఓటు రాజకీయాలను పక్కన పెట్టి దేశం కోసం అంతా ఏకమై సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపుదామన్నారు. నియోజకవర్గంలో 20 వేలకు పైగా రోహింగ్యాలు ఉన్నారని, వారిని గుర్తించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు బస్వ పాపయ్యగౌడ్, మిద్దె సుదర్శన్‌రెడ్డి, పి.కృష్ణగౌడ్, జిట్టా రాజేందర్‌రెడ్డి, ఎస్.మల్లారెడ్డి, కె.జంగారెడ్డి, మాజీ ఎంపీపీ అశోక్‌గౌడ్, టి.జగదీశ్వర్‌రెడ్డి, ఎ.సత్తయ్య, బి.మల్లేష్, బి.సత్యనారాయణరెడ్డి, ఎన్.నర్సింహారెడ్డి, ఊటు మహేందర్, ఎ.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి