సంస్కరణ | - | Sakshi
Sakshi News home page

సంస్కరణ

Nov 9 2023 7:14 AM | Updated on Nov 9 2023 7:14 AM

- - Sakshi

ఎన్నికల
● ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు ● 2018 ఎలక్షన్‌ నుంచి అమలు
మీకు తెలుసా?

వికారాబాద్‌ అర్బన్‌: ఎన్నికల సంఘం ఎప్పడైనా ఓటరుకు ఏది సులభమో దానికే ప్రాధాన్యతనిస్తుంది. ఇందులో భాగంగానే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నూతన సాంకేతిక విధానం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధానమే నవంబర్‌ 30న జరిగే ఎన్నికల్లో అమలు చేసేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ సిద్ధమైంది. ఇందుకు సంఘం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. 2018 ఎన్నికల ముందు ఈవీఎంలపై అభ్యర్థి పేరు, కేటాయించిన గుర్తు మాత్రమే ఉండేది. 2018 శాసన సభ ఎన్నికల నుంచి పోటీలో ఉండే అభ్యర్థి ఫొటోను పార్టీ గుర్తు పక్కన ప్రదర్శింస్తుంది. ఈవీఎంలలో అభ్యర్థుల పేరు, పార్టీ గుర్తుతోపాటు 2.5 సెంటీ మీటర్ల పొడవుతో అభ్యర్థి ఫొటో ఉంటుంది. ఓటరుకు పార్టీ సింబల్‌ గుర్తు పట్టక పోయినా అభ్యర్థిని చూసి ఓటు వేసే వెసులుబాటు కలుగనుంది. నోటా వద్ద మాత్రం క్రాస్‌ గుర్తు ఉంటుంది. ఓటర్లు అభ్యర్థుల విషయంలో గందరగళానికి గురికాకుండా ఉండేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు పోటీ చేసే అభ్యర్థులు మూడు నెలల క్రితం తీయించుకున్న స్టాంప్‌ సైజ్‌ కలర్‌ ఫోటోను నామినేషన్‌ వేసే సమయంలో రిటర్నింగ్‌ అధికారికి అంజేయాల్సి ఉంటుంది. ఫోటో వెనకాల రంగులు లేకుండా తెల్లగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement