వెన్నెలవాడగా మార్చుతాం | - | Sakshi
Sakshi News home page

వెన్నెలవాడగా మార్చుతాం

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ: పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పట్టణ బ్యూటిఫికేషన్‌లో భాగంగా రూ.2.65కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌ను సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, స్థానిక కౌన్సిలర్‌ అనితలతో కలిసి ప్రారంభించారు. వెన్నెలవాడగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొదటి, రెండో బైపాస్‌రోడ్లలోని ప్రధాన ప్రాంతాల్లో 150 స్తంభాలు, 300 ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో 82 విద్యుత్‌ స్తంభాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. తిప్పాపూర్‌ బస్టాండ్‌ ఆధునికీకరణకు రూ.1.60కోట్లు కేటాయించామన్నారు. బస్టాండ్‌లో దిగిన ప్రయాణికులు సులభంగా ఆలయానికి చేరుకునేలా ప్రత్యేక మార్గాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు 45 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం బద్దిపోచమ్మ ఆలయం, భారీ శివుడి విగ్రహం, టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement