నేను చాలా ఏళ్లుగా సిరిసిల్లలో కారీలు అమ్ముతూ ఉపాధి పొందుతున్న. నాలుగు రోజుల క్రితం తీవ్రమైన జలుబుతో జ్వరం వచ్చింది. అచేతనంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి వచ్చిన. టెస్టులు చేసిండ్రు. జ్వరం తగ్గుతూ..మళ్లీ వస్తోంది.
– అబ్దుల్ రషీద్, కారీ విక్రయదారుడు, సిరిసిల్ల
విరోచనాలు
మా బాబు సుశాంత్‌కు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. వెంటనే వాంతులు అయ్యాయి. తగ్గడానికి మందు వేస్తే విరోచనాలు మొదలయ్యాయి. ఆలస్యం చేయకుండా ఆదివారం జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చినం.
– పుల్లూరి సుశాంత్, ముస్తాబాద్
చికిత్స అందిస్తాం
జ్వరాలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రోగులకు చికిత్స అందించేందుకు జిల్లా ఆస్పత్రిలో ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు, ఓఆర్‌ఎస్‌లు, యాంటిబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఐసీయూలో పది పడకలు కేటాయించాం.
– డాక్టర్ సుమన్ మోహన్‌రావు, ఆర్‌ఎంవో


