28న నేరెళ్లకు కవిత | - | Sakshi
Sakshi News home page

28న నేరెళ్లకు కవిత

Jul 27 2026 2:06 AM | Updated on Jul 27 2026 2:06 AM

తంగళ్లపల్లి: మండలంలోని నేరెళ్ల గ్రామానికి ఈనెల 28న టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రానున్నట్లు మండల ఇన్‌చార్జి చెరుకుపల్లి శైలజ తెలిపారు. ఇటీవల మృతి చెందిన నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు.

వాసరవేణికి జాతీయ పురస్కారం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వాసరవేణి పర్శరాములు తెలుగు భాషా సాహిత్యానికి చేస్తున్న కృషి, బాల సాహిత్యంలో రచన, పరిశోధనలకు గాను జాతీయ తెలుగు విశేష ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. పర్శరాములు కొంతకాలంగా తెలుగు భాషా సంస్కృతి, అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. వీటిని గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేశ్‌ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ, పల్లె భాషలో ప్రజల కష్టాలు, చిన్నారుల గాథల గురించి అనేక పరిశోధనలు చేయడం జరిగిందన్నారు. 20కి పైగా పుస్తకాలు రచించి బాల సాహిత్యంలో పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవి ద్యాలయం నుంచి డాక్టర్‌ పట్టా పొందారని, 500కు పైగా వ్యాసాలు రాశారన్నారు. జూలై 28న న్యూఢిల్లీలో అవార్డు అందుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా పర్శరాములును రచయితలు జలపాల శంకరయ్య, మహేశ్వరశర్మ, లక్ష్మయ్య, మ హేందర్‌, నీలకంఠం, దేవరాజు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement