అభిషేకం.. పారాయణం | - | Sakshi
Sakshi News home page

అభిషేకం.. పారాయణం

Jul 26 2026 7:42 AM | Updated on Jul 26 2026 7:42 AM

సిరిసిల్లటౌన్‌: తొలి ఏకాదశి పర్వదినాన్ని జిల్లా కేంద్రంలో శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సుప్రభాతసేవ, అభిషేకం, సహస్ర విష్ణుపారాయణం జరిగాయి. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు రవీందర్‌, లక్ష్మణ్‌, అర్చకులు మాడంరాజు కృష్ణమాచారి, శ్రీకాంత్‌చారి, వర్ధనాచారి పాల్గొన్నారు. గాంధీనగర్‌ హనుమాన్‌ ఆలయంలో రుక్మిణి విఠలేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించారు.

కాంగ్రెస్‌ కొవ్వొత్తుల ర్యాలీ

సిరిసిల్లటౌన్‌: నీట్‌ పేపర్‌ లీకేజీ, జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనలోని మృతులకు నివాళిగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి గాంధీచౌక్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఆకునూరి బాలరాజు, రాగుల జగన్‌, సత్యం, చందు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement