రెక్కల కష్టం వృథా | - | Sakshi
Sakshi News home page

రెక్కల కష్టం వృథా

Jul 26 2026 7:42 AM | Updated on Jul 26 2026 7:42 AM

ఒకప్పుడు నెలలో అన్ని దినాలు బీడీలతో ఉపాధి పొందేవాళ్లం. ఇప్పుడు పెద్ద కంపెనీల్లో పీఎఫ్‌, ఈఎస్‌ఐ పథకాలకు అర్హులమైనా నిత్యం పని దొరకడం లేదు. ఫలితంగా రోజువారీ నగదు కూలీ కోసం వర్దీ బీడీలతో కార్మికులు రెక్కల కష్టాన్ని వృథా చేస్తున్నాం. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలి. – దాసరి రూప, బీడి కార్మికురాలు

కార్మికుల సంక్షేమం పట్టించుకోవాలి

జిల్లా అధికారులు బీడీ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాలి. వర్దీ బీడీలతో కార్మికులకు పని దొరుకుతుంది కానీ ప్రభుత్వం, కార్మికులకు నష్టం జరుగుతుంది. లైసెన్స్‌ లేకుండా సాగుతున్న అక్రమ వ్యాపారం మూసేయాలి.

– సూరం పద్మ, బీడీ కార్మిక నేత

టేకేదారులే మధ్యవర్తులు

జిల్లాలోని పలువురు బ డా కంపెనీల టేకేదారులు వర్దీ బీడీలతో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికారులకు లై సెన్స్‌డ్‌ కంపెనీల బీడీల తయారీ చూపిస్తూ అధికశాతం వర్దీ బీడీలను చేయిస్తున్నారు. అన్‌బ్రాండ్‌ కంపెనీలను సీజ్‌ చేసి బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి. – మూశం రమేశ్‌,

బీడీ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement