● కలెక్టర్, ఎస్పీ, దేవాదాయ కమిషనర్‌కు నోటీసులు
వేములవాడ: 17వ వార్డు కౌన్సిలర్ కొండ్లెపు ముత్యంకు చెందిన భీమన్న ఆలయం ముందున్న షాపు కూల్చివేత ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌లకు ఈనెల 24న నోటీసులు జారీ చేసింది. బాధితుడు ముత్యం శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తదితర అంశాలతో నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని కమిషన్ ఆదేశించినట్లు తెలిపారు. తాను నిర్వహిస్తున్న షాపును కక్షపూరితంగా కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో గత నెల 20న జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. తన ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. కౌన్సిలర్లు మైలారం శ్రీనివాస్, వంగల శ్రీనివాస్ ఉన్నారు.


