సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రలో ఘనంగా నిర్వహించారు. గాంధీచౌక్, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నా యకులు కేక్‌లు కోసి స్వీట్లు పంచారు. జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఎస్పీటీడీసీ మాజీ చైర్మన్, రాష్ట్ర నాయకుడు గూడూరి ప్రవీణ్, అర్బన్‌బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, కుంభాల మ ల్లారెడ్డి పాల్గొన్నారు. సిరిసిల్ల కోర్టు ప్రాంగణంలో బీఆర్‌ఎస్ లీగల్‌సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంత్‌రావు పాల్గొన్నారు. జిల్లా దివ్యాంగ సమితి ఆధ్వర్యంలో చేసిన వేడుకల్లో దొంతినేని చంద్రారావు, నీరటి రాజు, నరేశ్, శోభారాణి పాల్గొన్నారు.
విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు
రాజీవ్‌నగర్‌లో గిప్ట్ ఏ స్మైల్‌లో భాగంగా విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, మున్సిపల్ విప్ బుర్ర మల్లికార్జున్, కౌన్సిలర్లు లింగంపల్లి భాగ్యలక్ష్మి, దొంతినేని కళ్యాణి అశోక్‌రావు, మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ, పాఠశాల హెచ్‌ఎం మండల భూపతి తదితరులు పాల్గొన్నారు.


