● జిల్లాలో విచ్చలవిడిగా విడినూనెల విక్రయాలు ● అదనపు ఆదాయంపై వ్యాపారుల దృష్టి ● పట్టించుకోని ఫుడ్‌సేఫ్టీ అధికారులు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో విచ్చలవిడిగా విడినూనెల విక్రయాలు ● అదనపు ఆదాయంపై వ్యాపారుల దృష్టి ● పట్టించుకోని ఫుడ్‌సేఫ్టీ అధికారులు

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

● జిల్లాలో విచ్చలవిడిగా విడినూనెల విక్రయాలు ● అదనపు ఆదాయంపై వ్యాపారుల దృష్టి ● పట్టించుకోని ఫుడ్‌సేఫ్టీ అధికారులు

కల్తీకాగుతోంది !

వేములవాడ: తొలి ఏకాదశికి పిండి వంటలు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఇదే అవకాశంగా వ్యాపారులు కల్తీ నూనెల విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేర్లను పోలిన స్టిక్కర్లు వేసి.. సెకండ్‌ క్వాలిటీ ఆయిల్‌ విక్రయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత జరుగుతున్నా ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. నూనె ప్యాకెట్లు కొనుగోలు చేసే సమయంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(ఆహారభద్రత లైసెన్స్‌) నంబర్‌, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీలను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

వివరాలు ఇలా..

వేములవాడలో నూనె దుకాణాలు : 12

రెండు నెలల్లో

సేకరించిన

శాంపిల్స్‌ : 05

నమోదైన కేసులు : 01 కేసు పెండింగ్‌

తనిఖీలు చేస్తాం

పండుగ సందర్భంగా ఎక్కువ మంది పిండివంటలు చేసుకుంటుంటారు. షాపుల్లో తనిఖీలు చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడైనా లోపాలు కనిపిస్తే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకురండి.

– అనూష, ఫుడ్‌సేఫ్టీ అధికారి, సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement