● ఎంవీఐ వంశీధర్
సిరిసిల్లటౌన్: ప్రయాణికులతో వెళ్తున్న గూడ్స్ వా హనాలపై విజి లెన్స్ అధికారులు శుక్రవారం కొరడా ఝుళిపించారు. శుక్రవారం కలెక్టర్ చౌరస్తా, వేములవాడ, కొదరుపాక ప్రాంతాల్లో సిరిసిల్ల ఎంవీఐ వంశీధర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను తరలిస్తున్న నాలుగు సరుకు రవాణా వాహనాలను సీజ్ చేసినట్టు ఎంవీఐ వంశీధర్ తెలిపారు. పర్మిట్ లేని లారీ, ఫిట్‌నెస్ లేని ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని 20 వాహనాలపై కేసులు బుక్ చేసినట్టు వివరించారు. తనిఖీల్లో సాగర్, నిఖిల్‌కుమార్‌రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.


