వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు చర్యలు

Jul 24 2026 1:51 AM | Updated on Jul 24 2026 1:51 AM

ఆదర్శం కనగర్తి సర్పంచ్‌ నీటిని పొదుపు చేయాలి

సిరిసిల్ల: వక్ఫ్‌ భూములు, ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో వక్ఫ్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని వక్ఫ్‌ ఆస్తులు, భూముల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి గొట్టె జయశ్రీ, భూసేకరణ విభాగం ప్రత్యేక ఉప కలెక్టర్‌ కుమారస్వామి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కే.ఎస్‌.బి.కుమారి, జిల్లా సర్వే ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేశ్‌, జిల్లా మైనార్టీ అధికారి అయేషా, సిరిసిల్ల సబ్‌ రిజిస్ట్రార్‌ ఆర్వీవీ స్వామి, జిల్లా సంక్షేమాధికారి కుమారస్వామి పాల్గొన్నారు.

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తి సర్పంచ్‌ మల్యాల స్వామిదాస్‌ తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ బడిలో చేర్పించారు. స్వామిదాస్‌కు ముగ్గురు కూతుళ్లు. మొదటి కూతురు తేజస్విని గురుకులంలో పదో తరగతి చదువుతోంది. రెండో కూతురు ఝాన్సీ గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌లో నాలుగో తరగతి, మూడో కూతురు ప్రతిభ అదే స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతోంది.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నీటి వృథాను అరి కట్టి, పొదుపు చేసేందుకు బోర్‌వెల్‌ రీచార్జ్‌ ఫిట్స్‌ ఉపయోగపడతాయని జిల్లా గ్రామీణా భివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలో గురువారం బోర్‌వెల్‌ రీచార్జ్‌ ఫిట్‌ పనులను ప్రారంభించారు. సర్పంచ్‌ సుజాత, ఏపీడీ నర్సింలు, ఎంపీడీవో సత్త య్య, ఏపీవో కొమురయ్య, కార్యదర్శి ప్రవల్లిక, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చంద్రయ్య పాల్గొన్నారు.

ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి 30 మంది తరలింపు

వీర్నపల్లి(సిరిసిల్ల): ఉచిత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గురువారం మండలం నుంచి 30 మందిని ఆపరేషన్ల కోసం సిరిసిల్లలోని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి తరలించారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ మాడుగుల మల్లేశం, మండల మాజీ అధ్యక్షుడు శ్రీరామ్‌నాయక్‌, పార్టీ గ్రామాధ్యక్షుడు కముటం నాగరాజు, మాజీ ఉపసర్పంచ్‌ బోయిని రవి ఉన్నారు.

రూ.1,325కే మీటర్‌

వేములవాడ/వేములవాడరూరల్‌: నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని వేములవాడ మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు పేర్కొన్నారు. రాజు మాట్లాడుతూ నూతన కనెక్షన్‌ కావాలనుకున్న వినియోగదారులు రూ.1,325 ఎన్పీడీసీఎల్‌ అధికారులకు చెల్లించాలన్నారు. కౌన్సిలర్‌ తూం మధు, టీజీఎన్‌పీడీఎల్‌ డీఈ వెంకటరమణ, ఏఈ సిద్దార్థ పాల్గొన్నారు.

చిరుజల్లులు

సిరిసిల్ల: జిల్లాలో గురువారం చిరుజల్లులు కురిశాయి. తుంపర్లతో కూడిన కొద్దిపాటి జల్లులు పడ్డాయి. అత్యధికంగా రుద్రంగిలో 8.1 మిల్లీమీటర్ల వర్షం పడగా.. చందుర్తిలో 2.6, బోయినపల్లిలో 0.2, వేములవాడలో 0.4, సిరిసిల్లలో 2.3, కోనరావుపేటలో 0.5, వీర్నపల్లిలో 2.0, గంభీరావుపేటలో 0.4, ముస్తాబాద్‌లో 3.8, తంగళ్లపల్లిలో 2.2, ఇల్లంతకుంటలో 1.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వేములవాడ రూరల్‌, ఎల్లారెడ్డిపేట మండలాల్లో వర్షం జల్లులు పెద్దగా పడలేదు. వాతావరణం సాధారణంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement