● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం మారుపాక శివారులో సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణానికి స్థలాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ బుధవారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గోదాం నిర్మాణానికి అవసరమైన అనువైన స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. భూముల రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్‌కుమార్, ఆర్‌ఐ శ్రీధర్ ఉన్నారు.


